talaninda poodanda dalcina raani(తలనిండ పూడండ)


ఆ రజనీకర మోహన బింబము


రచన-దాశరధి
సంగీతము-ఘంటసాల


ఆ రజనీకర మోహన బింబము
నీ నగుమోమున బోలునటే
కొలనిలోని నవ కమల దళమ్ములు
నీ నయనమ్ముల బోలునటే
ఎచట చూచినా ఎచట వేచినా
నీ రూపమదే కనిపించినదే

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే   ||తల||

పూలవానలు కురియు మొయిలువో
మొగలి రేకులలోని సొగసువో నారాణి   ||తల||

నీపూలబాటలో నిండే మందారాలు
నీ పాట తోటలో విరిసే శ్రుంగారాలు
నీ మేనిలో పచ్చ చేమంతి అందాలు
నీ నీల వేణిలో నిలిచె ఆకాశాలు            ||తల||


rachana-daaSaradhi

saMgeetamu-ghaMTasaala


aa rajaneekara mOhana biMbamu

nee nagumOmuna bOlunaTae

kolanilOni nava kamala daLammulu

nee nayanammula bOlunaTae

echaTa choochinaa echaTa vaechinaa

nee roopamadae kanipiMchinadae



talaniMDa poodaMDa daalchina raaNi

molaka navvula tODa muripiMchabOkae   ||tala||



poolavaanalu kuriyu moyiluvO

mogali raekulalOni sogasuvO naaraaNi   ||tala||



neepoolabaaTalO niMDae maMdaaraalu

nee paaTa tOTalO virisae SruMgaaraalu

nee maenilO pachcha chaemaMti aMdaalu

nee neela vaeNilO niliche aakaaSaalu            ||tala||







Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)