palikindi yedalona anuraaga veena Get link Facebook X Pinterest Email Other Apps October 30, 2018 పలికింది యదలోన ప|| పలికింది యదలోన అనురాగ వీణ కురిసింది లోలోన పన్నీటి వాన చ|| చల్లని వెన్నెల వెల్లివిరియగా పిల్ల తెమ్మెరలు అల్లరి చేయగా లాలనగా లతలన్ని కదలగా కలగా కమ్మగ జగమే వెలయగ ||పలికింది|| Get link Facebook X Pinterest Email Other Apps Comments
vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది) July 04, 2018 విశాల భారత దేశం మనది రచన-దాశరధి సంగీతమ్-ఉపద్రష్ట కృష్ణమూర్తి విశాల భారత దేశం మనది హిమాలయాలకు నిలయమిది ఇలాంటి దేశంలో ప్రజలంతా విశాల హ్రుదయంతో మెలగాలి మతాలు వేరైతేనేమి భాశలు వేరైతేనేమి భారతీయులం అందరం భారతీయులం సుందరం ||విశాల|| ద్వేశమ్ రోషం తొలగాలి ప్రేమా స్నెహం మెలగాలి బుద్ధ గాంధీల బోధనలే తొలగించును మన వేదనలే ||విశాల|| ప్రేమపతాకం చేతగొని ఐక్యపధంపై పయనిద్దాం త్యాగశక్తి మనమహాయుధంగా దేశశత్రువులనెదిరిద్దాం ||విశాల|| rachana-daaSaradhi saMgeetam^-upadrashTa kRshNamoorti viSaala bhaarata daeSaM manadi himaalayaalaku nilayamidi ilaaMTi daeSaMlO prajalaMtaa viSaala hrudayaMtO melagaali mataalu vaeraitaenaemi bhaaSalu vaeraitaenaemi bhaarateeyulaM aMdaraM bhaarateeyulaM suMdaraM ... Read more
talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము) June 27, 2018 తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము రచన -శ్రీ రాయప్రోలు సుబ్బారావు సంగీతము-శ్రీ పాలగుమ్మి విశ్వనాథం తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపి కొలుతుము శబ్దములు ముత్యాల వలె నీ పాలవెల్లువ లోన తేలెను గీతమాయెను మీది మీగడ చేతనము చిగురించగా ||తల్లిరో|| అక్షరములై పుస్తకములో గానమై కలకంఠి ముఖమున తానమాలై వీణ తంత్రుల వెలసె నీ తొలి నుడువులే ||తల్లిరో|| పాలనీళ్ళను వేరుపరచే హంసపై స్వర హారమల్లుచు వేదవీధుల మీద తిరిగే భగవతీ శ్రీ భారతీ ||తల్లిరో|| నీదు కిన్నెర వంటి కంఠము నీదు సుశ్రుతి నొప్పు స్వరమును హంస నేర్పును చిలుక పలుకులు మాకొసంగుము శారదా ||తల్లిరో|| rachana -Sree raayaprOlu subbaaraavu saMgeetamu-Sree paalagummi viSvanaathaM tallirO sarasvati ninu ullamulalO nilipi kolutumu ... Read more
naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా) July 04, 2018 నారయణ నారాయణ అల్లా అల్లా రచన-కృష్ణ శాస్త్రి సంగీతం-పాలగుమ్మి విశ్వనాథం నారయణ నారాయణ అల్లా అల్లా మా పాలిటి తండ్రి మీ పిల్లలమేమెల్లా మతమన్నది నాకంటికి మసకైతే మతమన్నది నామనసుకు మబ్బైతే మతం వద్దు గితంవద్దు మాయామర్మం వద్దు ||నారాయణ|| ద్వేశాలు రోషాలు తెచ్చెదే మతమైతే కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే మతం వద్దు గతం వద్దు మారణహోమం వద్దు ||నారాయణ|| మతమన్నది గంధీజీ వితమైతే మతమన్నది లోకానికి హితమైతే హిందువులం ముస్లిములం అందరము మానవులం ||నారాయణ|| rachana-kRshNa Saastri saMgeetaM-paalagummi viSvanaathaM naarayaNa naaraayaNa allaa allaa maa paaliTi taMDri mee pillalamaemellaa matamannadi naakaMTiki masakaitae matamannadi naamanasuku mabbaitae ... Read more
Comments
Post a Comment