twameva sharanam
త్వమేవశరణం, త్వమేవ శరణం
ప|| త్వమేవశరణం, త్వమేవ శరణం
కమలోధర శ్రీ జగన్నాథా
చ|| వాసుదేవకృష్ణ వామన నరసింహ
శ్రీసతీశ సరసిజ నేత్రా
భూసురవల్లభ పురుశోత్తమ
పీతకౌశేయవసన జగన్నాథా
చ|| బలభద్రానుజ పరమపురుష
దుగ్ధజలధి విహార కుంజరవరద
సులభ సుభద్రాసుముఖ సురేశ్వర
కలిదోషహరణ జగన్నాథా
చ|| వటపత్రశయన భువనపాలన
జంతుఘటకారకరణ శృంగారాధిపా
పటుతర నిత్యవైభవ రాయ
తిరువెంకటగిరి నిలయ జగన్నాథా
Comments
Post a Comment