Posts

Showing posts from December, 2019

చరణాలు చరణాలు

చరణాలు చరణాలు రచన : కోవెల సుగుణ సంగీతం : శ్రీరంగం గోపాలరత్నం తాళం : ఖండచాపు రాగం : సింధు భైరవి ప॥ చరణాలు చరణాలు - ముక్తి సోపానాలు శరణన్న వారికవి - మోక్ష భవనాలు చరణాలు చ| ధరణి సుత హృదయాన - తనరారు చరణాలు గిరిజేశ వాకృతులు - కీర్తించు చరణాలు సిరిచూపు కలవారి - నివసించు చరణాలు సరయూ నదీ తటిని - చరియించు చరణాలు చరణాలు ॥ 2 చ|| అజ్ఞాన తిమిరమున - విజ్ఞాన కిరణాలు సుజ్ఞానులకు సకల - సౌవర్ణాభరణాలు శాంతి కవి నిలయాలు - సౌందర్య వలయాలు సంతోష ద్వారాలు - సకల శృతి తీరాలు /చరణాలు/

సుధామధురము

సుధా మధురం ఎన్: గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మ గీతం : పి.వి సాయి రాగం : మిశ్ర భాగేశ్వరి కం : త్రిశ్ర ఏక సుధా మధురం - రామ నామ గానము సద ధ్యాన సాగరమున - స్నాన మాచవేమనసా 11 వ్యధాహరణము రామ పాద ధ్యానము శ్రితానంద దాయకము- శ్రీరాముని శుభవామము 2 చ| ఇంతింతని పొగడలేని - ఘనతరము కామము          ఎంత పాడినను తరగవు  కృష్ణ సన్నుతుని లీలలు
దశరధనందన రామ దయా సాగరా రామ దశముఖ మర్ధన రామ దైత్యకులాంతక రామ రామ రామ జయ రామ రామ రామ జయ రామ రామ రామ జయ రామ రామ రామ జయ రామ. లక్ష్మణ సేవిత రామ లక్ష్మి  మనోహర రామ సూక్ష్మ స్వరూప సందరవదనా రామ. అయోధ్య వాసి రామ, అరణ్య వాసిరామ అహల్యోద్ధారక రామ ఆపద్ బాంధవ రామ భక్తవత్సలరామ, భవభయహరణా రాము జానకి జీవన రామ మారుతి సేవిత రామ శ్రీ రామ్ జయ రాం జయ జయ రాం శ్రీ రామ్ జయ రాం జయ్ జయ్ రాం జై రామ్

Vighnesha tava charanam

విఘ్నేశా తవచరణం విఘ్నవినాశక మమశరణం గంగాధరహర గౌరిమనోహర గిరిజాతనయా తవచరణం మూలాధారా మోదకహస్తా మోక్షదాయకా తవచరణం జ్ఞానాధారా జ్ఞానవినాయక నటనవినోదా తవ చరణం ||విఘ్నేశా