చరణాలు చరణాలు

చరణాలు చరణాలు

రచన : కోవెల సుగుణ
సంగీతం : శ్రీరంగం గోపాలరత్నం
తాళం : ఖండచాపు
రాగం : సింధు భైరవి

ప॥ చరణాలు చరణాలు - ముక్తి సోపానాలు

శరణన్న వారికవి - మోక్ష భవనాలు చరణాలు
చ| ధరణి సుత హృదయాన - తనరారు చరణాలు
గిరిజేశ వాకృతులు - కీర్తించు చరణాలు

సిరిచూపు కలవారి - నివసించు చరణాలు
సరయూ నదీ తటిని - చరియించు చరణాలు చరణాలు ॥

2 చ|| అజ్ఞాన తిమిరమున - విజ్ఞాన కిరణాలు

సుజ్ఞానులకు సకల - సౌవర్ణాభరణాలు
శాంతి కవి నిలయాలు - సౌందర్య వలయాలు

సంతోష ద్వారాలు - సకల శృతి తీరాలు /చరణాలు/

Comments

Popular posts from this blog

vishaala bhaaratadesham manadi(విశాల భారత దేశం మనది)

talliro saraswati ninu ullamulalo nilipi kolutumu(తల్లిరో సరస్వతి నిను ఉల్లములలో నిలిపికొలుతుము)

naaraayana narayana alla alla(నారాయణ నారాయణ అల్లా అల్లా)