చూచే కొలది సుందరము
చూచే కొలది సుందరము
రచన : డా|| బోయి భీమన్న
రాగం : పహాడి
సంగీతం : డా|| చిత్తరంజన్
తాళం : ఆది
చూచే కొలది సుందరము - సుందరము రసబంధురము చందన శీతల మార్దవము - నీ చరణాబ్ద మందిరము
చరణం 1: మాటే రాసమయ మానసము.
నీపాటే ప్రణయోపాసనము
ఆటే నటరాజేశ్వరము
ఆత్మే ముక్తీశ్వరము
చరణం 2: దరశనమే నయనో జ్వలము - నీ
స్పర్శనమే తను వల్లభము
ఆస్వాదనమే అనుభవము
అనుభవమే నీ ఆకారము
Comments
Post a Comment