ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట
తాళం: ఆది
రచన : కందుకూరి రామభద్రరావు
సంగీతం : శ్రీరంగం గోపాలరత్నం
రాగం : మిశ్రతిలంగ్
ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట
ఎంత పరిమలమోయి ఈ తోట పూలు
1.ఏ నందనము నుండి యీనారు తెచ్చిరో
ఏ స్వర్ణ నదీజలము లీమడులకెత్తిరో
ఇంత వింతల జాతు నీతోటలో పెరుగు
ఈ తోట మేపులో నింత నవకము విరియు
2.ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో ! ఏయచ్చరల మురువు నీతీరు దిద్దెనో !
ఈ పూల పాలలో నింత తీయందనము
ఈలతల పాకిళ్ళ కింత ఒయ్యారమ్ము
3.ఏమహత్తర శక్తులీతోటలో గలవో
ఏ దివ్య తేజమున కీపూలలో నెలవో !
ఈ తోట పై గాలి యింత మెయి సోకెనా
ఈ నీరసిలు బ్రతుకె యింత చివురింపనా !
4.జవరాలి వలపువలె రవిబింబ దీప్తి వలె
హిమన గోన్నతి వోలె ఋషి వాక్కు మహిమవలె నాయెడందను రేపు నాతెలుగు తోటలో
పాడుకొన నిండోయి ! పలవింప నిండోయి!
ఎంత చక్కని దోయి తెలుగుతోట
Comments
Post a Comment