ఎవరు పెంచిన కల్పతరులివి
రచన : శ్రీమతి జొన్నవాడ రాఘవమ్మ
సంగీతం : డా|| చిత్తరంజన్
రాగం: రాగమాలిక
తాళం: మిశ్రచాపు
ఎవరు పెంచిన కల్పతరులివి.
ఎవరు తీర్చిన సోయగములివి
ఎచట చూసిన ఊహకందని
అందమె కనువిందు చేసెను
1.సురభి చందన తరుల సందున
విరియ బూసిన కలువ కొలనులు
సురల కిరవగు గిరులపై
ఆమరకతమ్ముల మందిరమ్ములు
2.ఆకసమ్మున అల్లిబిల్లిగ
అలికి చుక్కలు దిద్దిరెవ్వరు
అందమగు ఆ చందమామను
కందుకము వలె కదిపిరెవ్వరు
3.పసిడి కొండల శిఖరములపై
పరువు లెత్తెడి అరుణ రేఖలు
ప్రకృతి మాత పైట చెంగున
పరవశించెడి ఈ జగమ్ములు
Comments
Post a Comment