అలికిడైతే చాలు
సంగీతం తిరుపతి రామానుజసూర్
తాళం: ఖండచాపు
రచన : కృష్ణశాస్త్రి
రాగం:కాప్
అలికిడైతే చాలు - ఆశతో నా కనులు
వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని
1.కమ్మతావులతోడ - నెమ్మదిగననుచేర
నీలిముంగురులలో - గాలి ఊయలలూగ ॥వెదకేను॥
2.కనులు మూసి నేను కలత నిదురపోవ
జాజిపూవుల మాల - జాడ చిక్కెడి కాడ. ॥వెదకేను॥
3.రోజాలు కోయగా తోటలోనికి రాగ
కొంటె ముల్లొకటి నా - కొంగు చివరను లాగ ॥వెదకేను ॥
Comments
Post a Comment