దసరా ఇది దసరా
సంగీతం : డా॥ చిత్తరంజన్
తాళం: తిశ్రగతి
రచన: శ్రీమతి గంగరాజు సుశీలాదేవి
రాగం: పహాడి
దసరా ఇది దసరా దేశం దశదిశలా
రకరకాల వినోదాల - విలసిల్లిన సరదా ఇది దసరా
1.ఒకచో బొమ్మల కొలువులు ఒకచో జమ్మికి పూజలు
ఒకచో నవరాత్రోత్సవ కాళికి బహుమానాలు
2.వివిధాయుధపూజలు వీరకంకజాలు
విజయీభవ విజయీభవ బాలుర బృందాలు
3.దసరా పులి వేషాలు పండుగ బహుమానాలు
ఎటు చూసిన సంబరాల విలసిల్లిన సరదాలు
Comments
Post a Comment