యుగయుగాలుగా
యుగయుగాలుగా
రచన : అబ్బూరి రామకృష్ణారావు
రాగం: మధువంతి
సంగీతం : రజని
తాళం : తిశ్రఏక
యుగ యుగాలుగా నన్నే కోరి యుండె కాబోలును
నే నడిచే దారి చెంత నిలిచియుండెనో ఏమో
1. ఏనాడో సంజ వేళ మసక మసక వెలుతురులో కనుగో నల నే నాతని కాంచి యుంటిననిపించును
2. వెలుగు జిలుగు పాటలతో - నేడే జాబిలి నివాళి. వీడిపోవు నీలి ముసుగు - నిశాముఖము నుండి వ్రాలి
వెన్నెల వెలుగుల నాతడు - కన్నులెదుట కనిపించగ తెరలన్నీ చిటికెలోన - సురిగిమాయ మైపోవును
Comments
Post a Comment