విష్ణు ఈశ్వరా బ్రహ్మముగ్గురు
విష్ణు ఈశ్వరా బ్రహ్మముగ్గురు
విష్ణు ఈశ్వరా బ్రహ్మ ముగ్గురూ - అన్నదమ్ములంతా
వారి మహిమతో చేసిన నేనొక - మట్టి బొమ్మ నంటా 1.తొమ్మిది కిటికీలు దర్వాజలతో మాటలాడుకొంటా
పోతే జీవమ పొద్దు సల్లంగ లేదు -పండుకొంట నేను
2.వస్తా పదదా పోతా పదరా - ధర్మము తన వెంటా యీ సాంబశివుడు నిను బిల్వ పంపెను - జల్డిగ రమ్మంటా
3. చేతిలో బెల్లం వున్నంతసేపే - కాకి పలకమంటా
చేతిలో బెల్లం సరి పడిపోతే ఎవరు రారు వెంటా
4. తొలినాళ్ళూ ఎవళ్ళయిననూ - గుంజుకు రమ్మంటా యమునోళ్ళొచ్చీ చుట్టు నిలిచినర కాళ్ళను తెమ్మంటా ॥
5. ఇంటి ముందటా మేక పిల్లలూ వేల బలగమంటా ఏడ్చేరు ఆర్చేరు గాని ఎవరు రారు వెంటా॥
6. నీళ్ళు బోసి కూర్చుండ బెట్టిరి - మాయ బొమ్మనంటా పువ్వులు దండలు వేసినారయా - పెద్దలు వీరంటా
7. చిన్ని పెద్దలు కూర్చున్నారు - చింతలు పడుకుంటా ఎత్తండోయి ఎత్తండోయి - ఏడు కట్ల సావారి ॥
8.దింపుడు కళ్ళం కాడ దించినారు పెద్దలు వీరంతా
సొమ్ము సొమ్మందము తీసుకొన్నరు పెద్దలు వీరంతా ॥
9.గురువే పోస్తడు శంకు తీర్థము - ముక్తి పెదవులంట
మంట్లో మన్నో గల్పి మరి పోతరువారంతా
10.ధనధాన్యములు ఎవరి పదార్థము - ధర్మము తన వెంట చేసిన పాపము చేసిన పుణ్యము - వచ్చును తన వెంట ||
Comments
Post a Comment