చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో
చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో
రచన : డా|| నారాయణరెడ్డి
రాగం : యమన్ & బేహాగ్
సంగీతం :డా|| చిత్తరంజన్
తాళం: చతురస్ర ఏక
ప|| చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో హృదయాలను పలికించే మృదు చిత్రణలెన్నెన్నో
చరణం 1: శిలలాగా పడి ఉన్నా - తెలవారని బ్రతుకైనా
అగుపించక ఎగసిపడే ఆ స్పందన లెన్నెన్నో
చరణం 2: ఆ మాటే విషమైనా బ్రతుకే వెగటైనా కసి మాటున సాగించే కరచాలన లెన్నెన్నో
చరణం 3: వికసించిన ప్రతికుసుమం - ప్రకటించదు తన హృదయం
అరుదైన సినారే పై ఆరాధన లెన్నెన్నో
హృదయాలను పలికించే మృదు చిత్రణలెన్నెన్నో
Comments
Post a Comment