హృదయాలతోటలు పూయగా
రచన: దాశరధి
రాగం: బిలహరి
సంగీతం : డా|| చిత్తరంజన్
తాళం: మిశ్రచాపు
హృదయాలతోటలు పూయగా వచ్చింది వాసంతం వాసంతం
మన భాగ్యనగరం అంతటా విరిసింది ఆనందం
1.రాళ్ళ గుండెలలో మల్లియలే తెల్లని నవ్వులొలికే
ముళ్ళ మనసులలో గులాబీలే తీయని తావి చిలిక
ఓ ఉగాది స్వాగతం స్వాగతం ఒయి నేస్తం స్వాగతం సుస్వాగతం. || హృదయాల ||
2.కథానాయకుడవై నీవు కదలి రావోయి
ఎల్ల జనులు మెచ్చు కొనగ మల్లెపూలు విచ్చుకొనగ సుధామయ జీవిపై నీవు సొంపు లిడవోయి
ఎల్ల జనులు మెచ్చుకొనగ మల్లె పూలు విచ్చుకొనగ
ఓ ఉగాది స్వాగతం స్వాగతం ఓయి నేస్తం స్వాగతం సుస్వాగతం. ||హృదయాల||
Comments
Post a Comment