ఈ వసంతాలలో
రచన : డా|| నారాయణ రెడ్డి
సంగీతం : డా|| బాలమురళీకృష్ణ
రాగం : చారుకేశి
ఈ వసంతాలలో నీ చూపు పిలిచెనా
ఈ వనాంతాలలో నీ రూపు మొలిచెనా
1. కన్నెకలువల మోవి కిన్నెరలు మ్రోయించు
ఎలనవ్వు పాటలో కలలెన్నో కరిగెనా
2.పండు వెన్నెల రేల వలపు దివ్వెల పాల
వెలుగులో కనరాని విరహాలు కలచెనా
తన ముంగురులు దాటి వనములన నడిచేటి
సెలయేటి గుండెలో తలపులే తొలిచెనా
॥ఈ వసంతాలలో ॥
Comments
Post a Comment