నాది మల్లెపూవు వంటి
నాది మల్లెపూవు వంటి
రచన : డా॥ సి. నారాయణరెడ్డి
రాగం : సింధుభైరవి
సంగీతం: డా.చిత్తరంజన్
తాళం : తిశ్ర ఏక
నాది మల్లెపూవు వంటి - నాణెమైన మేనట
రారా నీ చరణమ్ముల రాలిపోదు నేనిట
రారా గిరిధారి రారా వనమాలి
1 : నీవు లేని నాదు బ్రతుకు నిజముగ నేపెను ఎడారి
కరుణామృత మొలకబోసి కావుము నీ చరణదాసి -
ఓ మురళీలోల ఓ గోకుల బాల
2: ఉనికి లేనివాడ వంట కనిపించని వాడవంట
కన్నులున్న వారి కొరకు కలవు మింట కలవు ఇంట
ఓ నీల శరీర ఓయి నిరాకారా
Comments
Post a Comment