హరిగుణ గణములు
హరిగుణ గణములు
రచన: డా॥ సి.నారాయణరెడ్డి
రాగం: హిందోళం
సంగీతం: కలగ కృష్ణమోహన్
తాళం ఆది
హరి గుణగణములు గానము చేసి
పరవశించినది మీరా - పరవశించినది మీరా
1.సర్ప పేటికను రాణా పంపగ
చల్లగమిరా గ్రహియించే
స్నానమాడి ఆ పేటిక విష్పుడ
సాలగ్రామమే అగుపించే ........
2.విష పాత్రను రాణా పంపగ
విమలామృతమై, వివశించే
ఆ విషము తాను ఆరగింపగ
అమృత రూపమే సిద్ధించే
3.ఆశ్రితావనుడు మీరా ప్రభువే
అంతరాయముల తొలగించే
మేఘ సుందరుని గానములోనే
మీరానిరతము పులకించే
Comments
Post a Comment