ఆరబోసిన వెన్నెలలో
రచన : రజనీకాంతరావు
ఆరబోసిన వెన్నెలలలో ఆడుకుందమా ప్రియతమా విరజాజి మల్లెల ప్రేయసీ - కరవీర పూవుల ప్రేయసీ
1.రా కాశశాంకుని నవ్వు పువ్వుల - ఏకమాయెను ప్రకృతియే
ఆకాశ పుష్పము లెన్ని విరిసెను - అన్నిదిశలను ప్రేయసీ
2.గడ్డిపూవులు గాఢ ప్రేమలు - కౌగిలించుకు పోయెనే
ఈ దూది వెన్నెల సెజ్జ నిద్దుర - పోదమే రా ప్రేయసి
Comments
Post a Comment