Posts

Showing posts from October, 2018

palikindi yedalona anuraaga veena

పలికింది యదలోన ప|| పలికింది యదలోన అనురాగ వీణ కురిసింది లోలోన పన్నీటి వాన చ|| చల్లని వెన్నెల వెల్లివిరియగా పిల్ల తెమ్మెరలు అల్లరి చేయగా లాలనగా లతలన్ని కదలగా కలగా కమ్మగ జగమే వెలయగ  ||పలికింది||

maanasa mandira

మానసమందిర వాసిని ప|| మానస మందిర వాసిని భాషయ, విశాల కోమల కాంతిం మదాలసే శివ సుందరి వర్ధయ, నిజాత్మ భావన కిరణం చ|| పరశివ దయితే, వికాస భరితే, నానాజీవాకారే అవగతి ముదితే, అనన్య విదితే, అచలే అమలే దేవీ ||మానస మందిర|| చ|| విలశసి బహుధా, సుయోగ శరణం, భూద్వేర్వాచాం పారే పరమపి మధురే, సుభక్తి రుచిరే, శరణౌ వరణీయాసి ||మానస మందిర||  చ|| సులలిత హృదయే, సదైవ సదయే, నూనం త్వం మే మాతా గురువర రూపే, సరస సల్లాపే, భవతీ సచ్చిదానందా  ||మానస మందిర||

giriraaja suta tanaya

గిరిరాజసుతా తనయా ప|| గిరిరాజ సుతా తనయా సదయ గిరిరాజ సుతా తనయా సదయ అ. ప|| సురనాథముఖార్చిత పాదయుగ,  పరిపాలయమాం ఇభరాజముఖా ||గిరిరాజ|| చ|| గణనాథపరాత్పర శంకర గణవారినిధీ, రజనీకర ఫణిరాజకంకణ విఘ్ననివ రణశాంభవశ్రీ త్యాగరాజనుత ||గిరిరాజ||

gam gam ganapati

గం, గం గణపతి గం గం గణపతి, గం గం గణపతి గం గణపతయే నమః గం గం గణపతి, గం గం గణపతి గం గణపతయే నమః ఏకదంతాయ వక్రతుండాయ శ్రీ గణేశాయ నమః మోదహస్తాయ, రక్త వర్ణాయ, లంబోదరాయ నమః హస్త వరదాయ, సూక్ష్మనేత్రాయ, సర్పసూత్రాయనమః బుద్ధి ప్రదాయ, సిద్ధినాథాయ పాశహస్తాయనమః అర్కరూపాయ నాట్యప్రియాయ, గౌరీసుతాయ నమః దుర్గప్రియాయ, దురిత దూరాయ, దుఃఖహరణాయనమః ప్రథమవంద్యాయ, పాపనాశాయ, పరమాత్మనే నమః సకల వ్ద్యాయ, సాధువంద్యాయ, సచ్చిదానందాయ నమః

twameva sharanam

త్వమేవశరణం, త్వమేవ శరణం ప|| త్వమేవశరణం, త్వమేవ శరణం  కమలోధర శ్రీ జగన్నాథా చ|| వాసుదేవకృష్ణ వామన నరసింహ  శ్రీసతీశ సరసిజ నేత్రా భూసురవల్లభ పురుశోత్తమ  పీతకౌశేయవసన జగన్నాథా చ|| బలభద్రానుజ పరమపురుష  దుగ్ధజలధి విహార కుంజరవరద సులభ సుభద్రాసుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా  చ|| వటపత్రశయన భువనపాలన  జంతుఘటకారకరణ శృంగారాధిపా పటుతర నిత్యవైభవ రాయ తిరువెంకటగిరి నిలయ జగన్నాథా

vinayaka vinayaka vigna vinayaka

వినాయకా వినాయకా, వినాయకా, విఘ్న వినాశక వినాయకా విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా శుక్లాంబరధర వినాయకా, శంభోనందన వినాయకా మూషికవాహన వినాయకా, సచ్చిదానందా వినాయకా వినాయకా స రి గ మ పా  వినాయకా స రి గ మ పా వినాయకా వినాయకా వినాయకా వినాయకా విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా గౌరీ తనయా వినాయకా విజ్ఞాధీశ్వర వినాయకా విశ్వాధారా వినాయకా సచ్చిదానందా వినాయకా వినాయకా స రి గ మ పా  వినాయకా స రి గ మ పా వినాయకా వినాయకా వినాయకా వినాయకా విఘ్నవినాశక సిద్ధిప్రదాయక విశ్వవిధావక వినాయకా

guruvaayurappa

గురువాయురప్పా కృష్ణా ప|| గురువాయురప్పా కృష్ణా, గురువాయురప్పా  గురువాయురప్పా కృష్ణా, గురువాయురప్పా  కృష్ణా రామా గోవింద గురువాయురప్పా రామకృష్ణా గోవింద గురువాయురప్పా || గురువాయురప్పా || భక్తవత్సల భాగవతప్రియ, గురువాయురప్పా పాండురంగా, పండరినాథా గురువాయురప్పా ||గురువాయురప్పా|| భజనంద భజనంద భజనంద లాలా గోవింద గోపాల హరినంద లాలా ||గురువాయురప్పా||