అంతే నాకు చాలు
అంతే నాకు చాలు అంతే నాకు చాలు - తమలపాకు తొడిమే పదివేలు అందరి వోలె అడిగేదాన్ని కాదు కొందరి వోలె కొసరే దాన్ని కాదు 1.ముక్కూకు ముక్కెరలేక - ముక్కు చిన్న బోయీ నాది ముగ్గురూ తమ్ముళ్ళా నడిగి - ముక్కుకూ ముక్కెర తేరా - మామా ॥ 2.నడుమూకూ వడ్డాణం లేకా - నడుమూ చిన్న బోయినాది నలుగురూ చెల్లెళ్ళ నమ్మి - నడుమూకూ వడ్డాణం తేరా మామా 3.చేతికి చెండీలేకా - చేయి చిన్నబోయినాది చేమాలోనదిరీ పంటానమ్మి - చేతీకి చెండీలూ తేరా - మామా ॥ 4.పట్టీ మంచం పరుపూలేక - మనసూ చిన్నబోయినాది పట్టా భూముల నమ్మూకోని - పట్టె మంచం పరుపూ తేరా మామా |