mokkajonna totalo(మొక్కజొన్న తోటలో)
మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో రచన-కొనకళ్ళ వెంకటరత్నం సంగీతం-బి.వి నరసింహారావు సుక్కలన్ని కొండమీద సోకు జేసుకునేయేళ పంటబోది వరిమడితో పకపకనవ్వేయేళ సల్లగాలి తోటకంత సక్కిలిగిలి పెట్టుయేళ మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచెకాడ కలుసుకో మరువకమావయ్య మరువకమావయ్య చీకటి మిణుగురజోతుల చిటిలుచిల్లులడకముందె సుద్దులరగాలు చెవులు నిద్దుర తీయకముందె ఆకసపు వడిమితోట ఆవలింత గొనకమునుపె పొద్దువారు వెంటనె పుంతదారి వెంటనె సద్దుమడగనిస్తిరా సద్దుమడగనిస్తిరా ముద్దుల మావయ్యా కొడ్డుగోద మళ్ళేసే కుర్రకుంకలకుగాని కలుపుతీతలైమల్లె కన్నెపడుచులకుగాని బుగ్గమీదమెడియేసె బూకమంతుకుగాని తోవకెదురు వస్తివా దొంగచూపు చూస్తివా తంటమన ఎద్దరికి తప్పదు మావయ్యా తప్పదు మావయ్యా కంచెమీద గుమ్మడిపువ్వు పొంచి పొంచి చూస్తాది విడబారిన జొన్న పొట్ట వెకిలినవ్వు నవుతాంది తమలపు తీగలు కాళ్ళకు తగిలి మొరాయిస్తాయి చెదిరిపోకు మవయా బెదిపోకు మావయా సదురుకో నీ పదును గుండె చక్కని మావయ్యా గుండె చక్కని మావయ్యా పనులుకట్టి ఎత్తి నన్ను పలుకరించ బోయినపుడు చెరుకు తోట మలుపుకాడ చిటికెలేసి ...