Posts

Showing posts from January, 2021

అంతే నాకు చాలు

 అంతే నాకు చాలు  అంతే నాకు చాలు - తమలపాకు తొడిమే పదివేలు అందరి వోలె అడిగేదాన్ని కాదు   కొందరి వోలె కొసరే దాన్ని కాదు  1.ముక్కూకు ముక్కెరలేక - ముక్కు చిన్న బోయీ నాది ముగ్గురూ తమ్ముళ్ళా నడిగి - ముక్కుకూ ముక్కెర తేరా - మామా ॥ 2.నడుమూకూ వడ్డాణం లేకా - నడుమూ చిన్న బోయినాది నలుగురూ చెల్లెళ్ళ నమ్మి - నడుమూకూ వడ్డాణం తేరా మామా 3.చేతికి చెండీలేకా - చేయి చిన్నబోయినాది  చేమాలోనదిరీ పంటానమ్మి - చేతీకి చెండీలూ తేరా - మామా ॥ 4.పట్టీ మంచం పరుపూలేక - మనసూ చిన్నబోయినాది పట్టా భూముల నమ్మూకోని - పట్టె మంచం పరుపూ తేరా మామా |

విష్ణు ఈశ్వరా బ్రహ్మముగ్గురు

 విష్ణు ఈశ్వరా బ్రహ్మముగ్గురు  విష్ణు ఈశ్వరా బ్రహ్మ ముగ్గురూ - అన్నదమ్ములంతా   వారి మహిమతో చేసిన నేనొక - మట్టి బొమ్మ నంటా 1.తొమ్మిది కిటికీలు దర్వాజలతో మాటలాడుకొంటా పోతే జీవమ పొద్దు సల్లంగ లేదు -పండుకొంట నేను  2.వస్తా పదదా పోతా పదరా - ధర్మము తన వెంటా యీ సాంబశివుడు నిను బిల్వ పంపెను - జల్డిగ రమ్మంటా  3. చేతిలో బెల్లం వున్నంతసేపే - కాకి పలకమంటా  చేతిలో బెల్లం సరి పడిపోతే ఎవరు రారు వెంటా  4. తొలినాళ్ళూ ఎవళ్ళయిననూ - గుంజుకు రమ్మంటా యమునోళ్ళొచ్చీ చుట్టు నిలిచినర కాళ్ళను తెమ్మంటా ॥ 5. ఇంటి ముందటా మేక పిల్లలూ వేల బలగమంటా ఏడ్చేరు ఆర్చేరు గాని ఎవరు రారు వెంటా॥ 6. నీళ్ళు బోసి కూర్చుండ బెట్టిరి - మాయ బొమ్మనంటా పువ్వులు దండలు వేసినారయా - పెద్దలు వీరంటా 7. చిన్ని పెద్దలు కూర్చున్నారు - చింతలు పడుకుంటా ఎత్తండోయి ఎత్తండోయి - ఏడు కట్ల సావారి ॥  8.దింపుడు కళ్ళం కాడ దించినారు పెద్దలు వీరంతా సొమ్ము సొమ్మందము తీసుకొన్నరు పెద్దలు వీరంతా ॥  9.గురువే పోస్తడు శంకు తీర్థము - ముక్తి పెదవులంట  మంట్లో మన్నో గల్పి మరి పోతరువారంతా 10.ధనధాన్యములు ఎవరి పదార్థము - ...

హరిగుణ గణములు

 హరిగుణ గణములు  రచన: డా॥ సి.నారాయణరెడ్డి రాగం: హిందోళం సంగీతం: కలగ కృష్ణమోహన్ తాళం ఆది హరి గుణగణములు గానము చేసి పరవశించినది మీరా - పరవశించినది మీరా 1.సర్ప పేటికను రాణా పంపగ  చల్లగమిరా గ్రహియించే స్నానమాడి ఆ పేటిక విష్పుడ   సాలగ్రామమే అగుపించే ........ 2.విష పాత్రను రాణా పంపగ విమలామృతమై, వివశించే ఆ విషము తాను ఆరగింపగ అమృత రూపమే సిద్ధించే  3.ఆశ్రితావనుడు మీరా ప్రభువే అంతరాయముల తొలగించే మేఘ సుందరుని గానములోనే  మీరానిరతము పులకించే

నాది మల్లెపూవు వంటి

  నాది మల్లెపూవు వంటి రచన : డా॥ సి. నారాయణరెడ్డి రాగం : సింధుభైరవి సంగీతం: డా.చిత్తరంజన్ తాళం : తిశ్ర ఏక నాది మల్లెపూవు వంటి - నాణెమైన మేనట రారా నీ చరణమ్ముల రాలిపోదు నేనిట  రారా గిరిధారి రారా వనమాలి 1 : నీవు లేని నాదు బ్రతుకు నిజముగ నేపెను ఎడారి కరుణామృత మొలకబోసి కావుము నీ చరణదాసి - ఓ మురళీలోల ఓ గోకుల బాల 2: ఉనికి లేనివాడ వంట కనిపించని వాడవంట కన్నులున్న వారి కొరకు కలవు మింట కలవు ఇంట  ఓ నీల శరీర ఓయి నిరాకారా

యుగయుగాలుగా

 యుగయుగాలుగా రచన : అబ్బూరి రామకృష్ణారావు రాగం: మధువంతి సంగీతం : రజని తాళం : తిశ్రఏక యుగ యుగాలుగా నన్నే కోరి యుండె కాబోలును  నే నడిచే దారి చెంత నిలిచియుండెనో ఏమో  1. ఏనాడో సంజ వేళ మసక మసక వెలుతురులో               కనుగో నల నే నాతని కాంచి యుంటిననిపించును  2. వెలుగు జిలుగు పాటలతో - నేడే జాబిలి నివాళి.          వీడిపోవు నీలి ముసుగు - నిశాముఖము నుండి వ్రాలి   వెన్నెల వెలుగుల నాతడు - కన్నులెదుట కనిపించగ తెరలన్నీ చిటికెలోన - సురిగిమాయ మైపోవును

చూచే కొలది సుందరము

 చూచే కొలది సుందరము రచన : డా|| బోయి భీమన్న రాగం : పహాడి సంగీతం : డా|| చిత్తరంజన్ తాళం : ఆది చూచే కొలది సుందరము - సుందరము రసబంధురము చందన శీతల మార్దవము - నీ చరణాబ్ద మందిరము చరణం 1: మాటే రాసమయ మానసము.                  నీపాటే ప్రణయోపాసనము                 ఆటే నటరాజేశ్వరము                   ఆత్మే ముక్తీశ్వరము చరణం 2: దరశనమే నయనో జ్వలము - నీ                 స్పర్శనమే తను వల్లభము                 ఆస్వాదనమే అనుభవము                అనుభవమే నీ ఆకారము

చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో

 చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో రచన : డా|| నారాయణరెడ్డి రాగం : యమన్ & బేహాగ్ సంగీతం :డా|| చిత్తరంజన్  తాళం: చతురస్ర ఏక ప|| చిరునవ్వును పలికించే స్వరకల్పన లెన్నెన్నో హృదయాలను పలికించే మృదు చిత్రణలెన్నెన్నో చరణం 1: శిలలాగా పడి ఉన్నా - తెలవారని బ్రతుకైనా                అగుపించక ఎగసిపడే ఆ స్పందన లెన్నెన్నో చరణం 2: ఆ మాటే విషమైనా బ్రతుకే వెగటైనా                                  కసి   మాటున సాగించే కరచాలన లెన్నెన్నో   చరణం 3: వికసించిన ప్రతికుసుమం - ప్రకటించదు తన                      హృదయం                 అరుదైన సినారే పై ఆరాధన లెన్నెన్నో హృదయాలను పలికించే మృదు చిత్రణలెన్నెన్నో

అద్దమే చూసితినా

  సంగీతం : డా|| పి.బి. శ్రీనివాస్ తాళం : త్రిశ్రేక రచన : డా|| దాశరథి రాగం : మిశ్ర అభేరి అద్దమే చుసితిన అందులో ననీ వేలే  పద్దమే రాసితినా - ప్రతి పదమూ నీవేలే 1.ఎందుకే అందముగా నను చూసి నవ్వేవు అంతలో కోపముగా పిడుగులను రువ్వేవు నవ్వితే నా మదిలో పోవులెన్నో పూచేనే కోపమే చుపితివ గుండె పగిలిపోయేనే 2.హంసలా నడచితివా ఆకలంత తీరెనే నీటుగా నిలచితివా నోటనీరు ఉరేనే  మల్లెలే చల్లె నులే - చల్లని నీ నయనాలు మనసున దాచితినే - నీ చూపుల రతనాలు  నీడలో నీ వెంటే యిన్ని నాళ్ళు నడిచానే  మేడలానా మదినే నీ కోసం మలిచానే అద్దమే చూసితినా 

ఆరబోసిన వెన్నెలలో

  రచన : రజనీకాంతరావు  ఆరబోసిన వెన్నెలలలో ఆడుకుందమా ప్రియతమా  విరజాజి మల్లెల ప్రేయసీ - కరవీర పూవుల ప్రేయసీ  1.రా కాశశాంకుని నవ్వు పువ్వుల - ఏకమాయెను ప్రకృతియే   ఆకాశ పుష్పము లెన్ని విరిసెను - అన్నిదిశలను ప్రేయసీ   2.గడ్డిపూవులు గాఢ ప్రేమలు - కౌగిలించుకు పోయెనే  ఈ దూది వెన్నెల సెజ్జ నిద్దుర - పోదమే రా ప్రేయసి

ఈ వసంతాలలో

రచన : డా|| నారాయణ రెడ్డి  సంగీతం : డా|| బాలమురళీకృష్ణ రాగం : చారుకేశి ఈ వసంతాలలో నీ చూపు పిలిచెనా  ఈ వనాంతాలలో నీ రూపు మొలిచెనా 1. కన్నెకలువల మోవి కిన్నెరలు మ్రోయించు  ఎలనవ్వు పాటలో కలలెన్నో కరిగెనా  2.పండు వెన్నెల రేల వలపు దివ్వెల పాల వెలుగులో కనరాని విరహాలు కలచెనా  తన ముంగురులు దాటి వనములన నడిచేటి  సెలయేటి గుండెలో తలపులే తొలిచెనా ॥ఈ వసంతాలలో ॥

ఎంత సుందరమైనది

  రచన, సంగీతం : శ్రీ పాలగుమ్మి విశ్వనాథం రాగం: వలజి తాళం: ఆది  ఎంత సుందర మైనది -భగ వాసుడొసగిన ఐహుమతి  1.ఎంతసుందరమైనది జగతి ఎంచి సృష్టించినీ జగతి కరు జించి మన కొస గెనే వసతి  భగవానుదొసగిన బహుమతి 2.నింగిలో విహరించు మేఘాలు నింగినే దిగి వచ్చు వర్షాలు పొంగి పొరలు నదీ నదాలు పరవశించే జల్లపాతాలు 3.హాయిగా ఆ పకులు - ఆకసాన షికారులు  రక రకాల నాదాలు విసిరే - మావి కొమ్మల పికములు ||

ఎవరు పెంచిన కల్పతరులివి

రచన : శ్రీమతి జొన్నవాడ రాఘవమ్మ సంగీతం : డా|| చిత్తరంజన్ రాగం: రాగమాలిక  తాళం: మిశ్రచాపు  ఎవరు పెంచిన కల్పతరులివి. ఎవరు తీర్చిన సోయగములివి  ఎచట చూసిన ఊహకందని  అందమె కనువిందు చేసెను 1.సురభి చందన తరుల సందున విరియ బూసిన కలువ కొలనులు సురల కిరవగు గిరులపై ఆమరకతమ్ముల మందిరమ్ములు 2.ఆకసమ్మున అల్లిబిల్లిగ అలికి చుక్కలు దిద్దిరెవ్వరు  అందమగు ఆ చందమామను కందుకము వలె కదిపిరెవ్వరు 3.పసిడి కొండల శిఖరములపై పరువు లెత్తెడి అరుణ రేఖలు ప్రకృతి మాత పైట చెంగున పరవశించెడి ఈ జగమ్ములు

దసరా ఇది దసరా

  సంగీతం : డా॥ చిత్తరంజన్ తాళం: తిశ్రగతి రచన: శ్రీమతి గంగరాజు సుశీలాదేవి రాగం: పహాడి దసరా ఇది దసరా దేశం దశదిశలా రకరకాల వినోదాల - విలసిల్లిన సరదా ఇది దసరా 1.ఒకచో బొమ్మల కొలువులు ఒకచో జమ్మికి పూజలు ఒకచో నవరాత్రోత్సవ కాళికి బహుమానాలు 2.వివిధాయుధపూజలు వీరకంకజాలు  విజయీభవ విజయీభవ బాలుర బృందాలు 3.దసరా పులి వేషాలు పండుగ బహుమానాలు  ఎటు చూసిన సంబరాల విలసిల్లిన సరదాలు

హృదయాలతోటలు పూయగా

  రచన: దాశరధి రాగం: బిలహరి సంగీతం : డా|| చిత్తరంజన్ తాళం: మిశ్రచాపు హృదయాలతోటలు పూయగా వచ్చింది వాసంతం వాసంతం  మన భాగ్యనగరం అంతటా విరిసింది ఆనందం 1.రాళ్ళ గుండెలలో మల్లియలే తెల్లని నవ్వులొలికే  ముళ్ళ మనసులలో గులాబీలే తీయని తావి చిలిక ఓ ఉగాది స్వాగతం స్వాగతం ఒయి నేస్తం స్వాగతం సుస్వాగతం.                              || హృదయాల || 2.కథానాయకుడవై నీవు కదలి రావోయి ఎల్ల జనులు మెచ్చు కొనగ మల్లెపూలు విచ్చుకొనగ సుధామయ జీవిపై నీవు సొంపు లిడవోయి  ఎల్ల జనులు మెచ్చుకొనగ మల్లె పూలు విచ్చుకొనగ  ఓ ఉగాది స్వాగతం స్వాగతం ఓయి నేస్తం స్వాగతం సుస్వాగతం.                               ||హృదయాల||  

అలికిడైతే చాలు

  సంగీతం తిరుపతి రామానుజసూర్ తాళం: ఖండచాపు రచన : కృష్ణశాస్త్రి రాగం:కాప్ అలికిడైతే చాలు - ఆశతో నా కనులు వెదకేను నలుదిశల - అతడేమొ అనుకొని  1.కమ్మతావులతోడ - నెమ్మదిగననుచేర నీలిముంగురులలో - గాలి ఊయలలూగ       ॥వెదకేను॥ 2.కనులు మూసి నేను కలత నిదురపోవ జాజిపూవుల మాల - జాడ చిక్కెడి కాడ.     ॥వెదకేను॥ 3.రోజాలు కోయగా తోటలోనికి రాగ కొంటె ముల్లొకటి నా - కొంగు చివరను లాగ  ॥వెదకేను ॥

ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట

   తాళం: ఆది  రచన : కందుకూరి రామభద్రరావు  సంగీతం : శ్రీరంగం గోపాలరత్నం రాగం : మిశ్రతిలంగ్ ఎంత చక్కనిదోయి ఈ తెలుగు తోట  ఎంత పరిమలమోయి ఈ తోట పూలు  1.ఏ నందనము నుండి యీనారు తెచ్చిరో ఏ స్వర్ణ నదీజలము లీమడులకెత్తిరో  ఇంత వింతల జాతు నీతోటలో పెరుగు  ఈ తోట మేపులో నింత నవకము విరియు 2.ఏ అమృత హస్తాల ఏ సురలు సాకిరో ! ఏయచ్చరల మురువు నీతీరు దిద్దెనో ! ఈ పూల పాలలో నింత తీయందనము  ఈలతల పాకిళ్ళ కింత ఒయ్యారమ్ము  3.ఏమహత్తర శక్తులీతోటలో గలవో ఏ దివ్య తేజమున కీపూలలో నెలవో !  ఈ తోట పై గాలి యింత మెయి సోకెనా ఈ నీరసిలు బ్రతుకె యింత చివురింపనా ! 4.జవరాలి వలపువలె రవిబింబ దీప్తి వలె   హిమన గోన్నతి వోలె  ఋషి వాక్కు మహిమవలె నాయెడందను రేపు నాతెలుగు తోటలో   పాడుకొన నిండోయి  ! పలవింప నిండోయి! ఎంత చక్కని దోయి తెలుగుతోట

చలి చలి వేకువ జామున

 సంక్రాంతి తాళం : ఏక రచన : ఆరుద్ర రాగం: భౌళి చలి చలి వేకువ జామున భోగి మంట కళకళలాడే మోములు మాముంగిటా || 1.వీధంతా నిండునట్లు పెద్దముగ్గులు ముగ్గుల పై కూర్చున్నవి - గొబ్బెమ్మలు, రాంభజన మందిరాన - మ్రోగు చిరతలు సందడిలో వినిపించవు - తొలికోడికూతలు 2.గుడ్డి దివ్వె వెలుతురులో - అడుగోదర్డీ కుడుతున్నాడింకా ఒక కొత్త లాల్చి మేలు కొలుపు పాడే సాతాను జీయరు  నీడతన్ని ఎవ్వరూ గేలి చేయరు. |